Breaking News

ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంటే..!

Published on Tue, 02/03/2026 - 20:45

ఈ రంగు కారు కొంటున్నారా?? ఒక చిన్న ప్రశ్న.. మనం కారు కొనే సమయంలో ఏమేమి చూస్తాం? మైలేజ్ చూస్తాం… ధర చూస్తాం… ఫీచర్స్ చూస్తాం… డిజైన్ చూస్తాం.. కానీ రంగు విషయంలో మాత్రం మనకు నచ్చిందే ఎంచుకుంటాం. అయితే ఆ రంగే మీ ప్రయాణ భద్రతపై ప్రభావం చూపుతుందని చెబితే నమ్ముతారా?

అవును.. సురక్షితంగా డ్రైవ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, వాహనం రంగు కూడా ప్రమాదాలకు ఒక కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలపై వారు చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

👉ఇతర రంగులతో పోలిస్తే..
ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసా? నలుపు రంగు కార్లకే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయట. ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు విజిబులిటీ సుమారు 47 శాతం వరకు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, మబ్బు ఉన్నప్పుడు, లేదా తక్కువ వెలుతురు ఉన్న సమయంలో నలుపు రంగు వాహనాలు స్పష్టంగా కనిపించవు. అందుకే ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

👉ఈ రంగులు అందంగా కనిపించినా..
గ్రే రంగు కార్లకు కూడా ప్రమాదాల శాతం ఎక్కువగానే ఉంది. సుమారు 11 శాతం వరకు రిస్క్ ఉందని తెలిపారు. అలాగే నీలం, ఎరుపు రంగు కార్లు కూడా 7 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలకు గురైనట్లు పరిశోధన చెబుతోంది. ఈ రంగులు అందంగా కనిపించినా, రోడ్డు మీద స్పష్టంగా కనిపించే విషయంలో కొంత వెనుకబడి ఉంటాయి.

👉ఏ రంగులు సేఫ్‌..
అయితే ఏ రంగులు సేఫ్‌గా భావిస్తున్నారు? తెలుపు, పసుపు, ఆరెంజ్, బంగారు రంగుల కార్లు రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల వీటికి ప్రమాదాల శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా తెలుపు రంగు వాహనాలు పగలు, రాత్రి రెండింట్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది టాక్సీలు, కమర్షియల్ వాహనాలు తెలుపు రంగులోనే ఉంటాయి.

👉నలుపు కారు కొనొద్దా?..
అంటే నలుపు కారు కొనొద్దా? అంటే అలా కాదు. రంగు ఒక్కటే కారణం కాదు. డ్రైవింగ్ విధానం, వేగం, రోడ్డు పరిస్థితులు, వాతావరణం… ఇవన్నీ కలిసి ప్రమాదాలకు కారణమవుతాయి. కానీ రంగు కూడా ఒక చిన్న అంశంగా పనిచేస్తుంది అనేది ఈ అధ్యయనం చెప్పే విషయం. కాబట్టి మీరు కొత్త కారు కొనాలని అనుకుంటే… ఒక్కసారి రంగు గురించి కూడా ఆలోచించండి. అందంగా కనిపించడమే కాదు… రోడ్డు మీద స్పష్టంగా కనిపించడం కూడా ముఖ్యం. భద్రత ముందు… స్టైల్ తరువాత.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు