Breaking News

Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్‌ కూడా!

Published on Thu, 10/10/2024 - 11:47

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు,  విమానాలు నడిపే ఓ మంచి పైలట్‌ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్‌ కూడా ఉంది.

2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్‌ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్‌ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.

ఈ సమయంలో పైలట్‌ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్‌ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్‌హిడ్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ​ చేసిన లాక్‌హీడ్‌ మార్టిన్ పైలట్‌  కూడా చెప్పుకొచ్చారు.

అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్‌ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా  దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్‌ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)