రాహుల్ వ్యాఖ్యలు తప్పే కానీ.. తీర్పులో ఏముందంటే..?

Published on Fri, 08/04/2023 - 19:09

ఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..

'దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బహిరంగంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికింది. కానీ పార్లమెంట్ పదవికి రద్దు చేయడం వంటి చర్యలు వ్యక్తి హక్కుకు భంగపరచడమే గాక.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 

అయితే పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీని కారణంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి దూరమయ్యారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతటి గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి సరైన కారణం ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా.. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.  

కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్‌ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని  వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్‌ కోర్టు మార్చి 23న రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్‌ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్‌ కోర్టు విధించిన శిక్షపై రాహుల్‌ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే


 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)