Breaking News

Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?

Published on Fri, 11/14/2025 - 13:51

పట్నా:  బీహార్‌లోని చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్‌లు అగ్రశ్రేణి పోటీదారులెవరనేది వెల్లడించాయి. తాజా డేటా ప్రకారం బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ 30,290 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ 28,719 ఓట్లు సాధించారు. మనీష్ కశ్యప్‌గా  పేరొందిన ప్రముఖ యూట్యూబర్‌ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

యూట్యూబర్ నుండి రాజకీయ నేత మారిన త్రిపురారి కుమార్ తివారీ(మనీష్‌ కశ్యప్‌) ప్రస్తుతం 12,081 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన  జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2020లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమాకాంత్ సింగ్ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ రంజన్‌ను 13,469 ఓట్ల తేడాతో ఓడించి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

సోషల్ మీడియాలో ప్రాంతీయ సమస్యను ప్రస్తావిస్తూ ప్రజాదరణ పొందిన మనీష్‌ కశ్యప్‌ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగారు. తన డిజిటల్ ప్రజాదరణతో ఎన్నికల్లో విజయం సాధించాలని  ఆశించారు. కాగా బీహార్ వలసదారులపై దాడులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో 2023లో తమిళనాడు పోలీసులు  యూట్యూబర్‌ మనీష్‌ కశ్యప్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీని వీడి జన్ సురాజ్‌లో చేరారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)