Breaking News

‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం

Published on Fri, 11/29/2024 - 10:31

సాక్షి, ముంబై:  దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

బహిరంగప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి 
ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్‌ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. 

కాలుష్య నియంత్రణకు సూచనలు.. 

  • ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారు

  • పరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం.  

  • ట్రాఫిక్‌ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం.  

  • పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. 

  • కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం.     

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)