Breaking News

భర్తపై దాడి చేస్తుంటే నువ్వేం చేశావ్‌?

Published on Wed, 07/22/2026 - 05:55

న్యూఢిల్లీ: గతేడాది మేఘాలయలో హనీమూన్‌ సమయంలో భర్తను చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్‌ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. వ్యాపారవేత్త రాజా రఘువంశీని చంపినట్లు ఆరోపణలున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్‌ను గతేడాది జూన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఆమెకు బెయిలిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.

‘మీ ప్రవర్తనను మీరు ఎలా సమరి్థంచుకుంటారు? మీరు భర్తతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడే అతడిపై దాడి జరిగింది. అతడు మరణించాడు. అప్పుడు, ఆ తర్వాత మీరేం చేశారు? ఇది ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అరెస్ట్‌కు కారణాలేంటని మీరు మొదట్లోనే పోలీసులను అడిగారా?..ఇది రెండో ప్రశ్న’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘పిటిషన్‌లో పేర్కొన్న ఆధారాలను బట్టి తగు ఆదేశాలు జారీ చేయడం లేదా నిందితురాలు సోనమ్‌ను లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించడం గానీ చేస్తాం. వీటికి సిద్ధపడి రండి..’అంటూ సోనమ్‌ తరఫు లాయర్‌తో వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)