Breaking News

లోకల్‌ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు

Published on Wed, 07/08/2026 - 20:06

ముంబై: లోకల్‌ రైళ్లలో డోరువద్ద నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌), రైల్వే పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో డోరువద్ద వేలాడుతున్న లేదా నిలబడిన 15,589 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.40.81 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ ఆఖరు వరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన వారపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ముంబై లోకల్‌ రైల్వే బోర్డు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో అత్యధికంగా భాయందర్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ముంబైకర్లకు లైఫ్‌ లైన్‌గా లోకల్‌ రైళ్లలో నిత్యం 75–80 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. ఇందులో 80 శాతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు ఉండగా మిగతా 20 శాతం సామాన్య జనాలుంటారు. ఉదయం, సాయంత్రం పీక్‌ హవర్స్‌లో దాదాపు అన్ని రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. లోపలికి వెళ్లేందుకు స్థలం దొరకదు. కానీ గ్రూపులు ఏర్పడిన కొందరు ప్రయాణికులు డోరువద్ద, ఫుట్‌ బోర్డుపై నిలబడి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తారు.

వీరు లోపలికెళ్లరు, తోటి ప్రయాణికులకు లోపలికెళ్లేందుకు అవకాశమివ్వరు. డోరు, ఫుట్‌ బోర్డుపై తిష్టవేసి నిలబడతారు. వీరు గ్రూపులుగా ఉండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరైనా లోపలికెళ్లేందుకు దారి ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తే పెత్తనం చెలాయిస్తారు. చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు. దీంతో వీరి జోలికి పోకుండా, వాగ్వాదానికి దిగలేక ఎలాగో మెల్లమెల్లగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా తోటి ప్రయాణకులను ఇబ్బందులకు గురిచేస్తున్న అకతాయిలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అదికారులు ఆర్పీఎఫ్, గర్నమెంట్‌ రైల్వే పోలీసు (జీఆర్పీ) బలగాలతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో వీరంతా పట్టుబడ్డారు.  

చ‌ద‌వండి: సీఎం ఫ‌డ్న‌వీస్‌కు రాజ్ ఠాక్రే బ‌హిరంగ లేఖ‌

⇒ ఇదివరకే నడిచే లోకల్‌ రైళ్లలో అటు, ఇటూ తిరుగుతూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న హాకర్లపై చేపట్టిన డ్రైవ్‌లో 7,765 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెక్షన్‌ 144 ప్రకారం రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు.

⇒ అత్యధికంగా కేసులు నమోదుచేసిన స్టేషన్లలో వల్సాడ్‌లో 1,315 మంది, వాపీలో 830 మంది, పాల్ఘర్‌లో 774 మంది, నందుర్బార్‌లో 691 మంది, వసయి రోడ్‌లో 621 మంది ఉన్నారు.  

⇒ ప్రత్యేక డ్రైవ్‌లో 482 ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు, 181 రాష్ట్ర భద్రతా బలగాలు పాల్గొన్నాయి.  

⇒ 2026 జనవరి ఒకటో తేదీ నుంచి జూన్‌ 25వ తేదీ వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో డోరువద్ద నిలబడిన 15,572 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.40.81 లక్షల జరిమానా వసూలు చేశారు.

⇒ అక్రమ హాకర్స్‌ 7,765పై చర్యలు తీసుకోగా ఇందులో 7,748 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38.41 లక్షలు జరిమానా వసూలు చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)