Breaking News

కేరళలో వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌.. ఎంత ప్రమాదకరమంటే?

Published on Wed, 05/08/2024 - 09:32

కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ విస్తరిస్తోంది.  దోమలు కుట్టడం ద్వారా ఈ జ్వరం సోకుతుంది. రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఈ కేసులు నమోదైన నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ప్రీ మాన్సూన్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ జ్వరం లక్షణాలు, ఇది సోకకుండా ఎలా రక్షించుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం.

కోజికోడ్‌లో ఇప్పటివరకు ఐదు వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని  వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. మలప్పురం, త్రిస్సూర్‌లో  కూడా ఈ వ్యాధి బారినపడినవారున్నారని, ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవని వారు తెలిపారు. అందుకే వ్యాధి సోకిన వారి సంఖ్యను అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేకపోతున్నారని సమాచారం.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జ్వరం సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకున్నారు. ఒకరు ఇప్పటికీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వెస్ట్ నైల్‌ జ్వరం లక్షణాలు డెంగ్యూ  మాదిరిగానే ఉంటాయి. 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించవు.

వెస్ట్‌ నైల్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ  దోమల వృద్ధిని అరికట్టడం, నీటి వనరులను శుభ్రపరచడంపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2011 నుంచి ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని, ఈ ఫీవర్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే డ్యెంగ్యూ  లక్షణాలు కనిపించినవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వెస్ట్ నైల్ ఫీవర్‌ దోమ కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. యూఎస్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం  ఈ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి లక్షణాలు కనిపించవు. అయితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన అనంతరం తగిన చిక్సిత్స అందకపోతే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. కేరళలో ఈ వ్యాధి సోకి 2019లో ఒకరు, 2022లో ఒకరు మృతి చెందనట్లు నివేదికలు చెబుతున్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)