Breaking News

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏడుగురి మృతి

Published on Tue, 04/01/2025 - 07:24

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 

పథార్‌ ప్రతిమా మండలంలోని ధోలాహట్‌ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్‌ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. 

ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్‌ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)