పశ్చిమ బెంగాల్‌లో హై అలర్ట్‌!

Published on Wed, 04/17/2024 - 09:01

పశ్చిమ బెంగాల్‌లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  సుమారు  ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ‍ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా  భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్‌సోల్, బరాక్‌పూర్‌లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. 

గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.

నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్  మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)