Breaking News

Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి

Published on Thu, 09/12/2024 - 05:05

కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్‌ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్‌ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్‌ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. 

సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌ జూనియర్‌ డాక్టర్లకు ఈ–మెయిల్‌ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్‌ మెయిల్‌లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్‌ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్‌ పేర్కొన్నారు. 

దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్‌ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. 

షరతులకు ఒప్పుకోం 
బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్‌ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్‌ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)