Breaking News

ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్‌లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు!

Published on Mon, 12/11/2023 - 08:10

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో చలి మరింతగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇంతేకాదు డిసెంబర్ 12 నుండి పశ్చిమ బెంగాల్, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ)హెచ్చరిక జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాతావరణ స్థితిగతుల విషయానికి వస్తే ఉష్ణోగ్రతలో నిరంతరం క్షీణత కనిపిస్తోంది. ఆదివారం (డిసెంబర్ 10) రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని, ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం (డిసెంబర్ 11) గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పేలవమైన విభాగంలోనే కొనసాగుతోంది. అంతే కాదు రాబోయే మూడు రోజుల్లో రాజధానిలో కాలుష్య సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని చోట్ల, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్‌మార్గ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. 
ఇది కూడా చదవండి: ఈ ‍మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)