Breaking News

కుమ్మేస్తున్న వర్షాలు.. మహారాష్ట్ర, గోవాలకు రెడ్‌ అలర్ట్‌

Published on Mon, 07/15/2024 - 07:01

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.

మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే  అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.

గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)