మరింతగా పెరిగిన చలి.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే!

Published on Wed, 01/03/2024 - 06:54

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలి మరింతగా పెరిగింది. దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. జమ్మూ కాశ్మీర్ నుండి బీహార్, పంజాబ్ వరకు, హర్యానా నుండి తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చలి తీవ్రత మరింతగా పెరిగింది. 

హిమాచల్‌లోని కుకుమ్‌సేరిలో ఉ‍ష్ణోగ్రతలు మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పహల్గామ్‌లో మైనస్ 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వతప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం కారణంగా, దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం రోజంతా చలిగాలులు కొనసాగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పొగమంచు ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారింది.

జనవరి 5 నుంచి 11వ తేదీ వరకూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దీని ప్రభావంతో మధ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ భాగంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా దిగజారే అవకాశాలున్నాయి. 

ఎత్తయిన పర్వత శిఖరాలపై మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ లోయ తీవ్రమైన చలిలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతింటున్నాయి. శ్రీనగర్‌ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 4, 5 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 8న కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండనున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)