Breaking News

మాస్కులు ధరించండి.. కరోనా కేసులు పెరగొచ్చు

Published on Sat, 04/01/2023 - 13:21

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల (Covid-19) పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా.. 2,995 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 16వేల మార్క్‌(16, 354) దాటింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ్టి (కేంద్రం గణాంకాల్లో) లెక్కల్లో కాస్త తగ్గుదలే కనిపిస్తున్నా.. రాబోయే రోజుల్లో మాత్రం కేసుల పెరుగుదల గణనీయంగా ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రముఖ మేదాంత ఆస్పత్రి(గురుగావ్‌) చెస్ట్‌ సర్జరీ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగొచ్చన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని దేశ ప్రజలకు సూచిస్తున్నారాయన. అయితే భారత్‌లో కరోనా రెండో వేవ్‌ నాటి ఆక్సిజన్‌ కొరత, గణనీయమైన మరణాల నమోదు లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారాయన. వ్యాక్సినేషన్‌ ప్రభావం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారాయన. అయితే.. 

వైరస్‌ వేరియెంట్‌, జనాలు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండొచ్చని, తద్వారా కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందన్నారు.  వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నా.. దాని వల్ల కొందరు ఇబ్బందులు పడొచ్చని తెలిపారు. పిల్లలకు.. వృద్ధులకు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకు, మరీ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లపై వైరస్‌ ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వేరియెంట్‌లలో మార్పులు త్వరగతిన జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు సూచిస్తున్నారు. 

కాబట్టి, లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. మాస్క్‌లు ధరించడం వల్ల ఎలాంటి నష్టం కలగదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)