Breaking News

పాతాళంలో ఉన్నా సరే పట్టుకొస్తాం: అమిత్‌ షా

Published on Mon, 11/17/2025 - 19:56

ఫరీదాబాద్‌: ఢిల్లీ పేలుళ్ల నిందితులను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. వారు ఈ భూమ్మీద కాదు.. పాతాళంలో ఉన్నా వేటాడి పట్టుకొచ్చి కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఈరోజు(సోమవారం, నవంబర్‌ 17వ తేదీ) హరియాణాలోని ఫరిదాబాద్‌లో నార్తరన్‌ జోనల్‌ కౌన్సిల్‌(ఎన్‌జెడ్‌సీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఈ తరహా ఉగ్రచర్యలకు పాల్పడే వారిని  ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హచ్చరించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని దాని మూలాల నుండి నిర్మూలించడమనేది తమ సమిష్టి నిబద్ధత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  యొక్క 'బలమైన రాష్ట్రాలు మాత్రమే బలమైన దేశాన్ని సృష్టిస్తాయి అనే దార్శనికతను చాటడంలో జోనల్ కౌన్సిల్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి రంగంలో జాతీయ పురోగతితో పాటు భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వంలో ప్రాంతీయ బలమే తమ లక్ష్యమన్నారు.  ఇదిలా ఉంచితే, ఢిల్లీ పేలుళ్లలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ రోజు ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)