Breaking News

పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!

Published on Thu, 06/22/2023 - 16:51

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలుపుతూ.. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఆమె న్యాయ సలహా కూడా తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం వైద్యులను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు.

ఇటీవల ఎల్‌జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన దీని గురించి మాట్లాడుతూ.. తనను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన సుచేతన, “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్‌జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మ్యాన్‌గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 41. ఫలితంగా నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను.

అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే దీని కోసం పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది. ఈ వార్తలను వక్రీకరించవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి ఈ నిర్ణయానికి మద్దతిస్తాడని సుచేతన భావిస్తున్నట్లు చెప్పింది.

చదవండి: రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్‌ ఘటన వెలుగులోకి

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)