Breaking News

వయనాడ్‌లో ప్రియాంకం

Published on Sat, 11/23/2024 - 16:57

సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్‌ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.

ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్‌ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్‌లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్‌ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్‌’వేదికగా వయనాడ్‌ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. 

‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్‌లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. 

నా సోదరుడు రాహుల్‌.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్‌ కూటమి నేతలు, కాంగ్రెస్‌ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్‌లో 74 శాతంగా నమోదైన పోలింగ్‌ ఈసారి నవంబర్‌ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్‌ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్‌కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి.  

నిఖార్సయిన నేత 
సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్‌ తూర్పు రీజియన్‌ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్‌ సెక్రటరీ(ఇన్‌చార్జ్‌)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్‌ స్కూల్, కాన్వెంట్‌ ఆఫ్‌ జీసెస్‌ అండ్‌ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. 

ఎట్టకేలకు లోక్‌సభకు 
పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్‌దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్‌గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌తో కలిసి పార్లమెంట్‌ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్‌ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. 

అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్‌ గాం«దీ, రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, వరుణ్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్‌తో కలసి పార్లమెంట్‌ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది.  

 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)