Breaking News

న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు

Published on Thu, 02/13/2025 - 13:04

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ త్వరలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. అయితే ఇంతలోనే అధిష్టానం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వికసిత్ ఢిల్లీ, ఆయుష్మాన్ భారత్ లాంటి కేంద్ర పథకాల అమలుకు, మురుగునీటి పారుదల, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలను కోరారు.

ఏదైనా ప్రాజెక్టు లేదా పథకాన్ని మంత్రి మండలికి సమర్పించాలనుకుంటే ముందుగా ఆ శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ అధిష్టానం కోరింది. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రారంభించే పథకాలు లేదా ప్రాజెక్టుల కోసం క్యాబినెట్ ముసాయిదా నోట్‌లను సిద్ధం చేయాలని బీజేపీ అన్ని విభాగాల అధిపతులను  ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, కొత్త ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నోట్ సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖను బీజేపీ కోరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ అగ్ర నేతలు హామీనిచ్చారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య తలెత్తకుండా  ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ప్రధాన కార్యదర్శి కోరారు.

ఇది కూడా చదవండి: మళ్లీ పాక్‌ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)