Breaking News

15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు..

Published on Thu, 06/19/2025 - 18:24

న్యూఢిల్లీ: ఎలక్టర్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్‌)ను ఓటర్లకు చేరవేసే విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోగానే ఈ కార్డులు సంబంధిత ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కార్డుల డెలివరీకి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ సమయం సగానికి తగ్గిపోనుంది. ఇందుకోసం నూతన ప్రామాణిక నియమావళిని ఎన్నికల సంఘం రూపొందించింది. కొత్తగా ఓటర్‌గా పేరు నమోదు చేసుకున్న తర్వాత లేదా ప్రస్తుతం ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా నూతన ఫొటో గుర్తింపు కార్డు ఓటర్లకు అందనుంది.  

ఓటరు గుర్తింపు కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి.
1. ముందుగా voters.eci.gov.in వైబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2. న్యూ రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్ జ‌న‌ర‌ల్ ఎల‌క్ట‌ర్స్‌లో 'ఫిల్ ఫామ్ 6'పై క్లిక్ చేయండి.
3. ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేయ‌గానే లాగిన్ అడుగుతుంది.
4. కొత్త యూజ‌ర్లు మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి.
5. త‌ర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. 


6. మీ పేరు, పాస్‌వర్డ్ ఎంట‌ర్ చేసి OTPని నమోదు చేయండి.
7. ఇప్పుడు  ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేస్తే.. లింక్ ఓపెన్ అవుటుంది.
8. ఫామ్ 6లో మీ రాష్ట్రం, జిల్లా, నియోజ‌వ‌ర్గం వివ‌రాలు న‌మోదు చేయాలి. 
9. మీ పూర్తి పేరు వివ‌రాల‌తో పాటు పాస్‌పోర్ట్‌ ఫొటో అప్‌లోడ్ చేయాలి.
10. ఫోన్, ఆధార్ నంబ‌రు, జెండ‌ర్‌, పెట్టిన‌తేదీ, చిరునామాల‌తో పాటు సంబంధిత ప‌త్రాలు అప్‌లోడ్ చేయాలి.

ఈ వివ‌రాలు అన్ని న‌మోదు చేసిన త‌ర్వాత దరఖాస్తును ప్రివ్యూలో చూసుకోవాలి. అన్ని వివ‌రాలు కరెక్టుగా ఉన్నాయ‌ని భావిస్తే స‌బ్మిట్ చేయాలి. 15 రోజుల్లోగానే ఎలక్టర్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు మీరు పొందుతారు. 

చ‌ద‌వండి: ఐటీ ఉద్యోగుల నెత్తిన మ‌రో పిడుగు?

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)