Breaking News

2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ?!

Published on Fri, 08/15/2025 - 12:46

రాహుల్‌ గాంధీ ఆరోపణలు.. వాటిని తోసిపుచ్చుతూ ఎన్నికల సంఘం.. పరస్పర సవాళ్లతో దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం అంశం తీవ్ర చర్చనీయాంగా మారింది. లోక్‌సభలో విపక్ష నేత మరింత స్వరం పెంచి ‘ఈ చోరీ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదని.. చాలా చోట్ల జరిగింది’’ అని అంటున్నారు. ఈ తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పలు నియోజకవర్గాల్లో ‘ఓట్‌ చోరీ’ జరిగిందంటూ ఓ ప్రొఫెసర్‌ చేసిన పరిశోధన మళ్లీ తెరపైకి వచ్చింది. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో అనుమానాస్పద రీతిలో అధికార పార్టీ కొన్ని సీట్లు గెల్చుకుందనేది ఆ ప్రొఫెసర్‌ వాదన. ఆయన పేరు సవ్యసాచి దాస్‌. హర్యానా అశోకా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.  ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’(Democratic Backsliding in the World’s Largest Democracy) పేరిట తన పరిశోధన పత్రాలను 2023లోనే ఆయన బయటపెట్టారు.  ఆ సంచలన పరిశోధన సారాంశం ఏంటంటే.. 

ఆ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు చాలానే సాధించింది. పోటీ తీవ్రంగా ఉన్న 59 స్థానాల్లో.. 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికలల్లో బీజేపీ తక్కువ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో ఓటర్ల వృద్ధి రేటు.. ఓడిన నియోజకవర్గాలతో పోల్చితే సగటున 5% తక్కువగా ఉంది. అందుకే దీనిని వ్యూహాత్మక డాటా మేనిప్యులేషన్‌కి సంకేతంగా సవ్యసాచి తన పరిశోధనల్లో పేర్కొన్నారు. అయితే.. 

అప్పటి ఓటర్‌ డాటా, పోలింగ్‌ సరళి ఆధారంగా జరిగిన పరిశోధన లెక్క ప్రకారం.. బీజేపీకి ఆ  30 స్థానాలు మాత్రమే రావాల్సి ఉంది. అంటే ఆ అదనపు 11 స్థానాలు ఓట్‌ చోరీతోనే గెలిచిందని "back-of-the-envelope" అనే గణాంకాలతో ఆయన ప్రస్తావించారు. 

ఓట్‌ చోరీ- ఇలా జరిగి ఉండొచ్చు..  
ఓటర్‌ డాటాను ఓ పద్దతి ప్రకారం మేనిపులేషన్‌ చేయడం అంటే.. ఓటర్‌ జాబితా నుంచి పేర్లను తొలగించడం, అందునా ప్రత్యేకించి ముస్లిం ఓట్లను తొలగించడం,  అలాగే.. పోలింగ్‌బూత్‌ల వద్ద ఓటింగ్‌ శాతం తగ్గించే చర్యలు తీసుకోవడం లాంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ప్రత్యేకించి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది జరిగిందనే విషయాన్ని పేర్కొన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని  ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో అసమానతలు గణనీయంగా ఎక్కువగా కనిపించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారాయన. ఆ రాష్ట్రాల సివిల్ సర్వీస్ అధికారుల బలహీనమైన పర్యవేక్షణ వల్ల ఇది జరిగిందని ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’ పరిశోధన పత్రం పేర్కొంది. ఈ మానిప్యులేషన్ ప్రభుత్వ ఏర్పాటును మార్చకపోయినా..(బీజేపీకి మేజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువే సీట్లే వచ్చాయి..) ప్రజాస్వామ్య నైతికతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని ప్రొఫెసర్‌ సవ్యసాచి ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)  303 లోక్‌సభ సీట్లు గెలిచి సింగిల్‌ డిజిట్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాల సీట్లతో కలిపి 353 కాగా.. రెండోసారి వరుసగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్‌ను బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేల్చిన ఆటంబాంబ్‌తో ఓట్ల దొంగతనం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  గతేడాది ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(ప్రత్యేకించి కర్ణాటక మహదేవ్‌పురలో లక్ష నకిలీ ఓట్లు), మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మోసం చేయడానికి బీజేపీతో ఎన్నికల కమిషన్‌ (EC)తో కుమ్మక్కైందని..ఇప్పుడు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే.. ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పుపట్టిన ఈసీ.. ఆధారాలు చూపించాలని రాహుల్‌ను కోరుతోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)