Breaking News

కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్‌!

Published on Wed, 07/29/2026 - 11:58

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ  వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్‌’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.

ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. 

మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)