Breaking News

రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్‌.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..

Published on Wed, 04/12/2023 - 13:25

మహా నగరాల్లో డ్రైవింగ్‌ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్‌ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్‌, కారు పార్కింగ్‌ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్‌ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది.

తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్‌ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్‌ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్‌ చేశారు. 

దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్‌యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్‌ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ షేర్‌ చేయడంతో వైరలవుతోంది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)