Breaking News

బుడతడి బిగ్‌ షాట్‌.. అమ్మ ఐఫోన్‌ జలసమాధి

Published on Fri, 06/19/2026 - 07:52

ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్‌లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్‌గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్‌‌ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్‌కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్‌లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్‌నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.

ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్‌ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్‌ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్‌గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్‌లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్‌ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)