Breaking News

Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు

Published on Mon, 11/25/2024 - 11:28

అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్‌ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్‌ యువరాజా అనే యువకుడు ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. 

ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఐన్‌స్టీన్‌ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్‌ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి.

 నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్‌ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో గట్టి చర్చకు దారి తీశాయి.     

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)