Breaking News

తప్పతాగి మహిళా పేషెంట్‌ని చితక్కొటిన డాక్టర్‌!

Published on Thu, 11/10/2022 - 11:53

చత్తీస్‌గఢ్‌: మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన కోర్బాలోని చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గెర్వాని గ్రామానికి చెందిన శ్యామ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్థరాత్రి ఆరోగ్యం బాగోకపోవడంతో అంబులెన్స్‌కి కాల్‌ చేశాడు.

ఐతే అంబులెన్స్‌ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్‌ తన తల్లిని ఆటోరిక్షాలో మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐతే డాక్టర్‌ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్‌ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్‌ షాక్‌ అయ్యి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు. ఐతే సదరు డాక్టర్‌ శ్యామ్‌ని సైలెంట్‌గా ఉండు అంటూ అతని తల్లిని పదే పదే కొడుతూనే ఉన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌కి షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఈ మేరకు మెడిక్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ అవినాష్‌ మిశ్రామ్‌ సదరు డాక్టర్‌కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి)

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)