Breaking News

Video: ఇదేం వింత.. పామును కసకస నమిలేసిన జింక..

Published on Mon, 06/12/2023 - 13:47

అడవి అనే పదం వింటే కృూర జంతువులు, వాటి వేట గుర్తుకొస్తుంది. జంతురాజ్యమైన అడవిలో సాధు జంతువులు తమకు ఎప్పుడు, ఏ వైపు నుంచి ప్రమాదం వచ్చిపడుతుందోనని భయపడుతూనే బతుకుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాలు ఎక్కువగా టార్గెట్ చేసేది జింకలనే. జింకలు చాలా సున్నితమైనవి. ఇవి పూర్తిగా శాఖాహారులు.. మాంసాహారం జోలికి వెళ్లవు. గడ్డి, ఆకులు, పండ్లు  తింటూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి.

అయితే సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇదే నిజం..  జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో నమిలి మింగేసింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత్‌ నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాఖాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు.

 ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హెర్బివర్‌(శాఖాహారి) జాతికి చెందిన జింక ఇలా మాంసాహారం తినడం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు.మరోవైపు జింకలు మాంసాన్ని వెంబడించవచ్చని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌ పేర్కొంది. జింకలో ఫాస్పరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాలను ఉండవని.. ముఖ్యంగా శీతాకాలపు నెలలలో మొక్కల జీవితం తక్కువగా ఉంటుందని,. ఈ కారణాలతో జింకలు మాంసాన్ని తినడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.
చదవండి: ఆ రోబోకి మనిషిలా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం జరుగుతాయట!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)