Breaking News

వైరల్‌: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్‌ హాల్‌కి వచ్చిన కొత్త జంట

Published on Mon, 10/18/2021 - 15:07

అలప్పజ( కొచ్చి): కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తడంతో అక్కడి ర‌హ‌దారులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే.

పెండ్లి మంట‌పానికి వారిద్దరు  అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వ‌చ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్‌లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లో​కి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా ప‌ని చేస్తున్న ఆకాష్‌, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు.

చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని త‌ల‌వ‌డిలోని ఫంక్షన్‌ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు.  అఖరికి పెండ్లి మంట‌పం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి ప‌రిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి స‌మ‌క్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక న‌వ‌ దంపతులు ఇద్ద‌రూ చెంగ‌నూర్‌లోని ద‌వాఖాన‌లో ఆరోగ్య కార్య‌క‌ర్త‌లుగా ప‌నిచేస్తున్నారు.

చదవండి: లాక్‌డౌన్‌లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)