Breaking News

శివరాత్రికి ‘మోనాలిసా’ సందడి.. ఎక్కడంటే..

Published on Mon, 02/17/2025 - 09:19

కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన మోనాలిసా ఇప్పుడు విదేశీయానం కూడా చేయబోతున్నారు. అది కూడా శివరాత్రి రోజున.. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మోనాలిసా ఖ్యాతి ఇప్పుడు విదేశాలను కూడా తాకింది. ఇంతకీ మోనాలిసా ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఏ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది?

మారుమూల గ్రామం నుంచి మహానగరం ముంబైకి చేరుకున్న మోనాలిసా త్వరలో బాలీవుడ్‌ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఇంతలోనే ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో మోనాలిసా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 26న మోనాలిసా నేపాల్‌లో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు ఆమెకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వనం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్‌ కంపోజర్‌ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సనోజ్‌ మిశ్రా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

ఈ కార్యక్రమ వివరాలను సనోజ్‌ మిశ్రా ఒక వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అందరినీ ఆహ్వానించారు. ప్రస్తుతం మోనాలిసా దర్శకుడు సనోజ్‌ మిశ్రా సహకారంతో నటనతో పాటు చదవడం, రాయడం కూడా నేర్చుకుంటున్నారు. తాజాగా ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. కుంభమేళాకు వచ్చిన 16 ఏళ్ల మోనాలిసా తన తేనె కళ్లతో అందరి దృష్టిలో పడ్డారు. రాత్రికిరాత్రే సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయారు.

ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)