Breaking News

ఇదేం విచిత్రం.. 138 మందికి ఒక్కడే తండ్రి..

Published on Thu, 12/05/2024 - 12:44

ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్‌. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి  100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బిహార్‌లోని తిర్హుట్‌ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్‌ బ్లాక్‌లోని బూత​ నంబర్‌ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్‌ అంకిత్‌గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్‌ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.

ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)