Breaking News

కాంగ్రెస్‌లోకి వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా.. హర్యానా ఎన్నికల్లో పోటీ!

Published on Wed, 09/04/2024 - 12:58

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కాయి. అభ్యర్థలు ఎంపిక, ప్రచారాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆప్‌తో సహా ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. అధికారమే అవధిగా వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

భారత స్టారల్‌ రెజర్లు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఇరువురు హస్తం కండువా కప్పుకున్నారు. వినేశ్‌, బజరంగ్‌ వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికట్లో పోటీ చేయనున్నారు. 

అయితే వినేశ్‌ ఫోగట్‌ జులనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జననాయక్‌ జనతా పార్టీకి చెందిన అమర్జీత్‌ ధండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పునియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.

కాగా గతేడాది భారత రెజ్లింగ్‌ సమాక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌పై  లైంగిక వేధింపుల ఆరోపణలతో వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం బ్రిజ్‌ భూషన్‌కు బీజేపీ కైసర్‌గంజ్‌ టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్‌ సింగ్‌కు కేటాయించింది. 

కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్‌ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)