Breaking News

వరుసగా మృతి చెందుతున్న పులులు... విషయం తెలిసిన గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే...

Published on Sun, 05/28/2023 - 12:26

మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌లోగల కూనో నేషనల్‌ పార్క్‌లో గడచిన రెండు నెలల​లో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్‌ తహసీల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్‌ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్‌ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్‌ 23న సౌత్‌ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు