Breaking News

ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published on Mon, 05/01/2023 - 20:57

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్‌ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్‌ అయ్యేందుకే కొంతమంది  మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది. 

మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్‌ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది.  రెడ్‌ టాప్‌, గ్రే కలర్‌ స్కర్ట్‌ ధరించిన యువతి  కాకా పాడిన 'షేప్' అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది.  ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది.  

అయితే.. మెట్రోలో డ్యాన్స్‌ చేయడానికి అనుమతి లేదని తెలుసని, కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేశానని చెబుతూ మరీ యువతి తన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతి డ్యాన్స్‌ను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మెట్రోలో ఇలాంటి పిచ్చి వేషాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిల ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి..

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)