Breaking News

వైరల్‌ వీడియో.. మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి

Published on Tue, 01/24/2023 - 11:42

మెట్రోలోని ప్రయాణికులను ఓ యువతి హడలెత్తించింది. చంద్రముఖి గెటప్‌ దర్శనమిచ్చి మెట్రో ప్రయాణిస్తున్న వారిని బెంబెలేత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి  చంద్రముఖి సీక్వెల్‌ అయిన బాలీవుడ్‌ హర్రర్‌, కామెడీ చిత్రం ‘భూల్‌ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించి ఉంది. క్లాసికల్‌ డ్యాన్స్‌ దుస్తులతో.. జుట్టుని ముఖంపై వేసుకొని అచ్చం చంద్రముఖిలా బిత్తర చూపులు చూస్తూ మెట్రోలో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది.

మెట్రో కంపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్క ప్రయాణికుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ వారిని పట్టుకొని భయపెట్టింది. అయితే యువతిని చూసిన పలువురు ప్రయాణికులు షాకవ్వగా ఓ వ్యక్తి భయంతో ముందుకు పరుగు తీయడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో యువతి ప్రవర్తనపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది దీన్ని ఫన్నీగా తీసుకొని నవ్వుతుంటే మరికొందరు బహరంగ ప్రదేశాల్లో ఈ పిచ్చి చేష్టలు ఏంటని మండిపడుతున్నారు.

‘ఇదే యాక్టింగ్‌ స్టేజ్‌ మీద చేసుంటే తప్పకుండా ఆమె మంచి నటిగా గుర్తింపు సాధించేది. డ్రామను థియేటర్లలో అభినందిస్తారు కానీ నిజ జీవితంలో కాదు. 50 రుపాయల ఓవర్‌ యాక్టింగ్‌. నాకు ఆశ్చర్యం వేస్తుంది.. ఆమె సెక్యూరిటీని దాటుకొని మెట్రోలో ఎలా ప్రయాణం చేయగలిగింది. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు.

కాగా అక్షయ్‌ కుమార్‌, విద్యా బాలన్‌  ప్రధాన పాత్రలో నటించిన భూల్‌ భూలయ్యా సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. 2007లో విడుదలైన ఈ సినిమాలో మంజులిక క్యారెక్టర్‌(చంద్రముఖి) అందరికీ గుర్తుండిపోయింది. ఈ పాత్రలో విద్యా బాలన్‌ అద్భుతంగా నటించింది.  తరువాత 2022లో ఈ సినిమా సీక్వెల్‌ భూల్‌ భులయ్యా-2 వచ్చింది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీ, టబు నటించగా.. ఈ మూవీ కూడా బాలీవుడ్‌లో రికార్డ్‌ విజయాన్ని సాధించింది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)