Breaking News

ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..

Published on Sat, 09/21/2024 - 10:35

రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్‌ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్‌ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది.  అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది.  మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్‌ వచ్చింది.

గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.

అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.  ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్‌ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)