Breaking News

Video: కింగ్‌ కోబ్రాను చంపి పిల్లలను రక్షించిన పిట్‌ బుల్‌

Published on Wed, 09/25/2024 - 09:32

పిట్‌బుల్‌ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్‌లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్‌ బుల్‌ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాన్సీలో జరిగింది.  శివగణేష్‌ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్‌ బుల్‌ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.

కుక్క దాని దవడల మధ్య కింగ్‌ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది.  చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది. 

ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్‌ బుల్‌ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)