Breaking News

Video: రైలు ప్ర‌మాదం.. తృటిలో త‌ప్పించుకున్న ప్ర‌యాణికుడు

Published on Thu, 07/18/2024 - 16:53

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గురువారం ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్  ప‌ట్టాలు త‌ప్పింది.  రైలు పట్టాలు తప్పడంతో.. నాలుగు ఏసీ  బోగీలు బోల్తా కొట్టాయి.

ఈ ఘటనలో ఇద్ద‌రు మృతి చెందగా.. అనేక‌మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  40 మంది సభ్యుల వైద్య బృందం, 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి.

కాగా రైలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌లో ఓ ప్ర‌యాణికుడు తృటిలో ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ మేర‌కు సంఘ‌ట‌నా స్థ‌లం నుంచే వీడియో రికార్డు చేసి సోష‌ల్ మిడియాలో పోస్టు చేశాడు. ట్రాక్ నుంచి ప‌క్క‌కు ప‌డిన నాలుగు ఏసీ కోచ్‌ల ప‌క్క‌న నిల‌బ‌డి.. తాను తృటిలో ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో త‌ప్పించుకున్న‌ట్లు తెలిపాడు. "నేను జీవించి ఉండటం ఒక అద్భుతం. దయచేసి నా గురించి చింతించకండి. నేను సురక్షితంగా ఉన్నాను. అని పేర్కొన్నాడు. వీడియోలో అతని వెనుక ఇతర ప్రయాణికులు అరుస్తూ, ఏడుస్తూ ఉండ‌టం క‌నిపిస్తుంది.

 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు