Breaking News

Video: బాప్‌రే..! డ్రెస్‌ బటన్లలో కొకైన్‌.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

Published on Sat, 01/07/2023 - 12:17

ముంబై విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఏకంగా 47 కోట్ల విలువైన మత్తుపదార్థాలను అధికారులు సీజ్‌ చేశారు.. ఈ కేసులోని ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

వివరాలు.. ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు శుక్రవారం విమనాశ్రయంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 31.29 కోట్ల విలువగల 4.47 కిలోల హెరాయిన్‌.. అలాగే 15.96 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ మొత్తం పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కెన్యాలోని నైరోబీ మీదుగా ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఓ వ్యక్తిని చెక్‌ చేయగా.. 4.47 కిలోగ్రాముల హెరాయిన్‌తో పట్టుబడినట్లు తెలిపారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన  హెరాయిన్‌ను 12 డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో చాకచక్యంగా దాచిపెట్టి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.31.29 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు

మరో కేసులో.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి  లగేజ్‌ స్కాన్ చేయడంతో అనుమానాస్పద బటన్‌లు కనిపించాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కుర్తా బటన్లు పక్కపక్కనే ఉండి ఎక్కవ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. బట్లను తీసి పరిశీలించగా 1.59 కిలోగ్రాముల కొకైన్‌ లభించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలో ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
చదవండి: ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్‌ ఏంటంటే!


 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)