రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. స‌ముద్రంలో కార్ల‌తో ఇరుక్క‌పోయిన యువ‌కులు

Published on Mon, 06/24/2024 - 15:19

కొంత‌మందిలో సోష‌ల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.  త్వ‌ర‌గా ఫేమ‌స్ అయిపోవాల‌ని, త‌మ వీడియోలు వైర‌ల్ అవ్వాల‌ని కొన్నిసార్లు ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్ట‌లు చేయ‌కూడ‌ద‌ని ఎంత‌మంది చెప్పినా త‌మ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తెచ్చుకోవ‌డం లేదు. తాగా ఇలాంటి ఘ‌ట‌న‌లో మ‌రొక‌టి వెలుగు చూసింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంత‌మంది యువ‌కులు త‌మ కారును స‌ముద్రంలోకి న‌డిపి ప్ర‌మాదంలో చిక్కుకున్నారు.  ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని క‌చ్ స‌ముద్ర తీరంలో జ‌రిగింది. ఇద్ద‌రు యుకులు రీల్స్ కోసం త‌మ రెండు మ‌హీంద్రా థార్ ఎస్‌యూవీ కారుల‌ను ముంద్రా స‌ముద్ర తీరంలోకి పోనిచ్చారు.  నీరు లోతు పెర‌గ‌డం, అల‌ల కార‌ణంగా రెండు వాహ‌నాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువ‌కులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రెడ్‌, వైట్‌ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు.  కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్‌వీల‌ను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)