Breaking News

Video: రైతుల సంఘీభావం.. బారికేడ్లపైకి ఎక్కి, పక్కకు లాగేసి విరగ్గొట్టి..

Published on Tue, 05/09/2023 - 10:28

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చాలా రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లకు రైతులు సోమవారం సంఘీభావం తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్‌ 23 నుంచి వాళ్లు ఆందోళన చేస్తుండటం తెలిసిందే. సోమవారం ఉదయం బంగ్లా సాహిబ్‌ గురుద్వారా నుంచి వందలాదిగా రైతులు కాలినడకన జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు.

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి, వాటిని పక్కకు లాగేసి విరగ్గొట్టారు. వేదిక వద్దకు చేరి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. ‘పోక్సో చట్టం కింద బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఇప్పటికీ అరెస్ట్‌ చేయలేదు. బీజేపీ నేతలు బ్రిజ్‌ భూషణ్‌కు అండగా ఉన్నారు. బాధిత రెజ్లర్ల తరఫున పోరాటం కొనసాగిస్తాం’అని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు.
చదవండి: Manipur Violence: సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం

ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రెజ్లర్ల వద్దకు వెళ్లే హడావుడిలో రైతులు బారికేడ్లను ధ్వంసం చేశారన్నారు. ఇది మినహా మరే ఇతర అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. పోలీసులు అడ్డుపడ్డారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్నవన్నీ అసత్యాలని తెలిపారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)