Breaking News

హనుమాన్‌ వేషాధారణతో డ్యాన్స్‌.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో..

Published on Sun, 09/04/2022 - 12:36

లక్నో: చావు ఎప్పుడు ఎవరిని ఎటునుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  ఈ మధ్య కాలంలో హఠాన్మారణాలు ఎక్కువైపోయాయి.  కళ్లముందేనవ్వుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి ఊపిరి వదులుతున్నారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో మృత్యువు మనిషిని తీసుకెళ్లి పోతుంది. తాజాగా గణేష్‌ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడు ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

గణేష్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్‌పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్‌ మండపం వద్ద లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు.
చదవండి: మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో!

అయితే స్టేజ్‌పై ప్రదర్శన చేస్తుండగా మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్‌పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)