రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు

Published on Fri, 09/20/2024 - 17:43

పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్‌, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్‌లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది.

శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్‌ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)