Breaking News

యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్‌

Published on Sun, 02/02/2025 - 09:07

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ పవిత్ర సంగమంలో  పుణ్య స్నానం ఆచరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా  ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్‌ పేర్కొన్నారు.

మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి  పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్‌ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, ​​సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి  ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి  పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)