Breaking News

మండుతున్న ధరలు.. 2 వేల కిలోల టమాటా లోడుతో పరారీ 

Published on Tue, 07/11/2023 - 11:06

సాక్షి, బెంగళూరు: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. బెంగళూరులో టమాటాలతో ఉన్న బొలెరో వ్యాన్‌తో దుండగులు పరారయ్యారు. చిత్రదుర్గకు చెందిన రైతులు బొలెరో వాహనంలో టమాటా లోడుతో బెంగళూరు ఆర్‌ఎంసీకి వచ్చారు. మార్కెట్‌ యార్డులో వాహనాన్ని నిలిపి టీ తాగడానికి వెళ్లారు. ఇదే అదనుగా ముగ్గురు వ్యక్తులు ఆ వ్యాన్‌ను స్టార్ట్‌ చేశారు. అడ్డగించగా రైతులే తమ వాహనాన్ని ఢీకొట్టారంటూ బుకాయించారు.

దెబ్బతిన్న తమ వాహనం చూపిస్తామంటూ రైతులను కూడా బొలెరోలోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక రైతులను బయటకు తోసేసి వాహనంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యా దు మే రకు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బొలెరో వాహనంలో 250కి పైగా ట్రేల్లో టమాటాలున్నాయి. కిలో టమాటా ధర కనీసం రూ.100 లెక్కన 2 టన్నుల టమాటా విలువ రూ.2 లక్షలుంటుంది.

300 మంది శరణార్థులు సముద్రంలో గల్లంతు 
దాకర్‌: ఆఫ్రికా దేశమైన సెనెగల్‌ నుంచి దాదాపు 300 మంది శరణార్థులతో స్పెయిన్‌కు బయలుదేరిన మూడు పడవలు అట్లాంటిక్‌ సముద్రంలో గల్లంతయ్యాయి. స్పెయిన్‌కు చెందిన వాకింగ్‌ బోర్డర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం ఈ విషయం వెల్లడించింది. రెండు పడవలు జూన్‌ 23న సెంట్రల్‌ సెనెగల్‌లోని కోస్తా తీర ప్రాంత నగరం ఎం»ౌర్‌ నుంచి బయలుదేరింది. వీటిలో 100 మంది ఉన్నారు. 200 మందితో రెండో పడవ జూన్‌ 27న కంటైటైన్‌ పట్టణం నుంచి బయలుదేరింది. తర్వాత మూడు పడవల నుంచి హఠాత్తుగా సంకేతాలు నిలిచిపోయాయి. అవి సముద్రంలో గల్లంతైనట్లు గుర్తించారు. స్పెయిన్‌ అధికారులు విమానాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.   
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)