Breaking News

MP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా.. రెండో మహిళగా రికార్డ్‌

Published on Thu, 11/30/2023 - 16:48

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు.  రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న  అవుట్‌గోయింగ్ సీఎస్‌ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు.

రెండో మహిళగా రికార్డ్‌
మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు