Breaking News

రాజధానిలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి

Published on Wed, 10/23/2024 - 10:51

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోగల ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం వసంత్ కుంజ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. కొద్దిసేపటికే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి లోపలికి ప్రవేశించారు. శరీరం కాలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితులను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) పాఠశాల  సమీపంలో పేలుడు సంభవించింది. రోజులు గడుస్తున్నా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఈ పేలుడు శబ్ధం దాదాపు 30 అడుగుల దూరం వరకు వినిపించగా, 250 అడుగుల మేర పొగలు కమ్ముకున్నాయి. ఈ పేలుడుపై ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్‌ఐఏ, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
 

ఇది కూడా చదవండి: మద్యంపై పోరులో మహిళల విజయం..!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)