Breaking News

Namo Ghat: కాశీ తమిళ సంగమం ప్రారంభం

Published on Mon, 12/18/2023 - 04:37

వారణాసి:  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని నమో ఘాట్‌లో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1,400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మది, సింధూ, కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు. వారణాసితోపాటు ప్రయాగ్‌రాజ్, అయోధ్యను వారు సందర్శిస్తారు.

తమిళనాడు, కాశీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంగమాన్ని మరింత బలోపేతం చేయడమే కాశీ తమిళ సంగమం ప్రధాన లక్ష్యం. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు అందులో పాలుపంచుకుంటున్నాయి. వారణాసి–కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఆయన సోమవారం వారణాసిలో రూ.19,155 కోట్లకు పైగా విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రోడ్లు, వంతెనలు, ఆరోగ్యం, విద్య, పోలీసు సంక్షేమం, స్మార్ట్‌ సిటీ, పట్టణాభివృద్ధి, రైల్వే, ఎయిర్‌పోర్టు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.   

అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్‌  
వారణాసిలో ఆదివారం ప్రధాని మోదీ వాహనశ్రేణి ఓ అంబులెన్స్‌కు దారి ఇచి్చంది. నాదేసర్‌ ప్రాంతంలోని కట్టింగ్‌ మెమోరియల్‌ స్కూల్‌ వైపు మోదీ కాన్వాయ్‌ దూసుకెళ్తుండగా దాని వెనుకే హరన్‌ మోగిస్తూ అంబులెన్స్‌ వచి్చంది. దారి కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన మోదీ కాన్వాయ్‌లోని వాహనాలు వేగం తగ్గించుకొని కాస్త పక్కకు వెళ్లాయి. వాటిని దాటుకొని అంబులెన్స్‌ ముందుకెళ్లిపోయింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)