ఇంట్లో నుంచే ‘దేవ్‌ దిపావళి’ని చూడండిలా..

Published on Wed, 11/13/2024 - 12:09

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్‌ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్‌ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.

ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్‌ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా  దేవ్‌ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.

గంగా సేవా నిధి వెబ్‌సైట్‌ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్‌సైట్‌ ద్వారా దేవ్‌ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది  తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.

నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్‌లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్‌ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్‌లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం 
త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి  వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)