బెంగాల్‌ ఎన్నికల కోసమే ఈ డ్రామా

Published on Mon, 12/08/2025 - 16:19

న్యూఢిల్లీ: వందేమాతరంపై  పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం అసలు ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. కేవలం పశి్చమ 
బెంగాల్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ డ్రామాకు తెర తీశారంటూ దుయ్యబట్టారు. తొలి ప్రధాని నెహ్రూ వందేమాతరాన్ని అవమానించారన్న మోదీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

వందేమాతర రచయిత బంకించంద్ర చటర్జీ బెంగాలీ గనుక, ఆ గేయంపై చిచ్చు రాజేసి ఓట్లు రాబట్టుకోవడమే మోదీ పన్నాగమని ఆరోపించారు. ‘ఇందుకోసం బెంగాల్‌ కే చెందిన మరో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్ర బోస్‌ కు నెహ్రూ రాసిన లేఖను మోదీ అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ మోదీ ఆరోపించినట్టుగా వందేమాతరంలోని కొన్ని చరణాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని నెహ్రూ ఎన్నడూ అనలేదు. 

పైగా మోదీ చెబుతున్నట్టుగా వాటిని తీసేయించనూ లేదు. నిజంగా ఆయన అలా చేసి ఉంటే వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే జాతీయ గేయంగా ఆమోదించిన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడైన ఆరెస్సెస్‌ నేత శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ అభ్యంతర పెట్టలేదేం?‘అని ప్రశ్నించారు. ముస్లిం సంతుషీ్టకరణ కోసం నాటి ముస్లిం లీగ్‌ నేత జిన్నా డిమాండ్‌ కు లొంగి వందేమాతరంలోని పలు పంక్తులను నెహ్రూ తొలగించారని మోదీ పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. 

ఈ విషయమై నెహ్రూ రాసిన లేఖే ఇందుకు రుజువని ఆయన చెప్పారు. ఇదంతా పచ్చి అబద్ధమని ప్రియాంక స్పష్టం చేశారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చేపట్టిన ప్రత్యేక చర్చలో సోమవారం ఆమె పాల్గొన్నారు. నెహ్రూపై మోదీ ఆరోపణలన్నింటినీ పూర్తిస్థాయిలో తిప్పికొట్టారు. వందేమాతరంలోని కొన్ని పంక్తులపై నెహ్రూ అభ్యంతరాలు లేవనెత్తారన్నది నాటి మతోన్మాద శక్తుల దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదని ఆమె చెప్పారు.

 బోస్‌ కు నెహ్రూ లేఖలో కొద్ది భాగాన్ని మాత్రమే తన వాదనకు అనువుగా మోదీ అన్వయించుకున్నారని ఆక్షేపించారు. ‘నెహ్రూపై మీకెందుకీ అకారణ ద్వేషం? మీకు గనుక దమ్ముంటే నెహ్రూపై మీరు చేస్తాను అన్ని ఆరోపణల మీదా పూర్తి స్థాయిలో ముందుగా సభలో చర్చ చేపడదాం రండి. ఆ తర్వాత ఈ అంశానికి మీరు శాశ్వతంగా తెర వేయాలి.

 మీ రాజకీయ ప్రయోజనం కోసం అవసరమైనపుడల్లా నెహ్రూపై బురదజల్లడాన్ని మానుకోవాలి‘ అంటూ మోదీ సర్కారుకు సవాలు ప్రియాంక విసిరారు. ‘కనీసం ఆ తర్వాతైనా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలపై చర్చిద్దాం. తద్వారా సభా సమయాన్ని సద్వినియోగం చేద్దాం‘ అని సూచించారు. ‘మోదీ దాదాపు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉంటున్నారు. దేశం కోసం పోరాడినందుకు నెహ్రూ దాదాపు అంతేకాలం జైల్లో గడిపారు‘ అంటూ తూర్పారబట్టారు. 

మోదీలో భయం.. 
ప్రధానికి ఆత్మవిశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోందని ప్రియాంక అన్నారు. ‘కొద్ది రోజులుగా అది కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. మోదీ ఒకప్పటి మోదీ కాదు. అన్నింటికీ భయపడుతూ గడుపుతున్నారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని నానాటికీ బలహీన పరుస్తుండటమే అందుకు కారణం’అని ప్రియాంక అన్నారు.   

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)