Breaking News

వందే భారత్ స్లీపర్‌కు ఫుల్ డిమాండ్‌..

Published on Tue, 01/20/2026 - 23:09

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలుకు ప్ర‌యాణికుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. కామాఖ్య –హౌరా మధ్య గురువారం నుంచి ప‌రుగులు తీయయనున్న వందే భార‌త్ స్లీప‌ర్ రైలు తొలి కమర్షియల్‌ జర్నీకి సంబంధించి టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. 

సోమవారం(జనవరి 19) ఉదయం 8:00 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవ్వగా.. కేవలం 24 గంటల లోపే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్‌ను 17 జనవరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి ఇంటీరియర్స్, సెన్సార్ ఆధారిత లైటింగ్, మెరుగైన బెర్తులు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి. 

అంతేకాకుండా హౌరా, కామఖ్య మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది. ఈ కారణాలతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి కనీస  ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కామాఖ్య నుంచి హౌరా మ‌ధ్య ప్రయాణానికి ఫస్ట్‌ ఏసీలో రూ.3,855, సెకెండ్‌ ఏసీలో రూ.3,145, థర్డ్‌ ఏసీలో రూ.2,435 ఖ‌ర్చు అవుతోంది.

నో వెయిటింగ్ లిస్ట్!
సాధారణ రైళ్లలో లాగా ఇందులో ఆర్‌ఎసీ(RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)